జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ ఉద్యోగులకు పండ్ల పంపిణీ కార్యక్రమానికి మంత్రి జగదీష్ రెడ్డి ప్రారంభించారు. కరోనా మహమ్మరిని నియంత్రించడానికి తమ ప్రాణాలను కూడా లెక్కచేయకుండా పనిచేస్తున్న డాక్టర్లు, మున్సిపల్ కార్మికులు, పోలీసు అధికారులు, అగ్నిమాపక, రెవెన్యూ, ఆశావర్కర్లకు 5కేజీల బత్తాయి పండ్లను పంపిణీ చేశారు.
కరోనా మహమ్మారికి ప్రపంచ మొత్తానికి ఓ సవాలుగా మారిందని మంత్రి వ్యాఖ్యానించారు. వైరస్ను నియంత్రించాలంటే స్వీయనియంత్రణ ఒక్కటే మార్గమన్నారు. భౌతిక దూరం పాటించాలని సూచించారు. కొవిడ్-19ని నియంత్రించడంలో భారతదేశం తీసుకుంటున్న నిర్ణయాలు గొప్పవన్నారు. కరోనా పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాల్లో.. ఇంటి వద్దకే నిత్యావసర సరుకుల అందిస్తామని దయచేసి ఎవరు బయటకు రావద్దని మంత్రి విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎస్పీ ఏవీ.రంగనాధ్, స్థానిక ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి, మున్సిపల్ ఛైర్మన్ సైదిరెడ్డి పాల్గొన్నారు.
ఇవీ చూడండి: 'కరోనా చికిత్సలో అసలు టార్గెట్ అదే!'