నల్గొండ జిల్లా దేవరకొండ సాయిరమ్య గార్డెన్లోని 'వానాకాలం-2020 నియంత్రిత వ్యవసాయ కార్యాచరణ ప్రణాళిక' నియోజక వర్గ స్థాయి సన్నాహక సమావేశానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. రైతులకు పంటల్లో అధిక దిగుబడి రావాలంటే పంట మార్పిడితోనే సాధ్యమని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. అందరూ ఒకే పంట వేస్తే గిట్టుబాటు ధరలు రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని... కాబట్టి పంటను మారిస్తే అధిక దిగుబడి వస్తుందని వివరించారు. తెలంగాణ రాష్ట్రం... రైతు రాజ్యం కావాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ అభిమతమని తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా మారాలని ప్రభుత్వం ఆలోచిస్తుంటే... కాంగ్రెస్ నాయకులు మాత్రం పేద రాష్ట్రంగా మార్చేలా కుయుక్తులు పన్నుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్, జడ్పీ ఛైర్మన్ నరేందర్ రెడ్డి, కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పటేల్ పాల్గొన్నారు.
ఇదీ చూడండి : కేసీఆర్కు ఎస్ఎల్బీసీ అంటే అంత భయమెందుకు: ఉత్తమ్