లాక్‌డౌన్ ప్రకటించిన నాటి నుంచి వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారింది. ఐదు నెలల కిందట పొట్టచేత పట్టుకొని కోదాడ పరిసర ప్రాంతాల్లో మిషన్ భగీరథ పనుల కోసం వలస వెళ్లారు కొందరు కార్మికులు. లాక్‌డౌన్ అమలులోకి రాగా పనులన్నీ నిలిచిపోయాయి. 14తో లాక్‌డౌన్ ముగుస్తుందని భావించిన వీరంతా.. ఇప్పుడు తమ స్వగ్రామాలకు పయనమయ్యారు.
నిన్న ఉదయం కోదాడ నుంచి బయలుదేరిన వీరంతా.. ఈరోజు నల్లగొండ జిల్లా మల్లెపల్లి వరకు ఆటోలో వచ్చారు. అక్కడ నుంచి ఏ వాహనం దొరక్కపోయే సరికి మల్లెపల్లి నుంచి దేవరకొండ మీదుగా వనపర్తికి వెళ్లడానికి పాదయాత్ర చేస్తున్నారు.
ఇదీ చదవండి: భార్యను తీవ్రంగా హింసించి... ఇంట్లోనే వదిలేసి!