అతి పెద్ద కంపెనీల్లో ఒకటైన మైక్రోసాఫ్ట్‌లో అత్యంత భారీ వేతనంతో ఉద్యోగం లభించడం ఊహించలేనిదని... నల్గొండ జిల్లాకు చెందిన ఐఐటీ విద్యార్థి సాయిచరిత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశాడు. ప్రాంగణ ఎంపికల్లో.. సదరు విద్యార్థికి ఏడాదికి కోటీ 54 లక్షలను మైక్రోసాఫ్ట్ ఆఫర్ చేసింది. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని ధర్మాపురానికి చెందిన చింతరెడ్డి సైదిరెడ్డి కుటుంబం... జిల్లా కేంద్రంలో నివాసముంటోంది.
ప్రతిష్టాత్మక బాంబే ఐఐటీలో చదివిన సాయిచరిత్ రెడ్డి... ఈ ఆఫర్ దక్కించుకున్న ఏకైక తెలుగు వ్యక్తిగా నిలిచాడు. చిన్నప్పట్నుంచి కష్టపడేతత్వం వల్లే అతి పెద్ద కంపెనీలో ఉద్యోగం దక్కిందంటూ ఆనందం వ్యక్తం చేశాడు. తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపాడు.
ఇదీ చదవండి: 'నిర్భయ' దోషికి క్షమాభిక్ష వద్దు: దిల్లీ ప్రభుత్వం