నాగార్జునసాగర్ హిల్‌కాలనీలో రెడ్డి జనసేవా సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కల్యాణ మండపాన్ని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కల్యాణ మండపం ప్రారంభోత్సవం జరిగింది.
సాగర్‌లో ఉన్న ప్రజలందరికీ కల్యాణ మండపం అందుబాటులో ఉంటుందని గుత్తా తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ ఛైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నందికొండ పురపాలక చైర్మన్ అనూష రెడ్డి పాల్గొన్నారు.