నల్గొండ పట్టణం పానగల్‌లోని పచ్చల సోమేశ్వరాలయం, ఛాయా సోమేశ్వరాలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారు జామునుంచే భక్తులు ఆలయానికి తరలొచ్చారు. గర్భ గుడిలోని శివలింగానికి భక్తులు పూలు, పాలు, పండ్లు, నెయ్యితో అభిషేకాలు చేశారు.
సాయంత్రం 7:30 గంటలకు పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మహోత్సవం జరగనున్నట్లు ఆలయ కమిటీ ఛైర్మన్ అనంత రెడ్డి తెలిపారు. స్వామి వారి కల్యాణానికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి దంపతులు సమర్పించనున్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: వైభవంగా శివరాత్రి.. శైవాలయాల్లో భక్తుల సందడి