ETV Bharat / state

'దేశంలో రైతు బీమా ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ' - miryala guda mla bhaskar rao updates

శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నల్గొండ జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే భాస్కర్​రావుతో కలిసి ఆయన రైతు వేదికను ప్రారంభించారు.

Legislative Council Chairman Gutta Sukhender Reddy has been involved in various development programs in Nalgonda district.
'దేశంలో రైతు బీమా ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ'
author img

By

Published : Jan 24, 2021, 4:54 PM IST

దేశంలో రైతు బీమా ఇచ్చే ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పేర్కొన్నారు. నల్గొండ జిల్లా అడవిదేవులపల్లి మండల కేంద్రంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన.. ఎమ్మెల్యే భాస్కర్​రావుతో కలిసి పాల్గొన్నారు.

అభివృద్ధి కార్యక్రమాలకు..

అడవి దేవులపల్లిలో నూతనంగా నిర్మించిన రైతు వేదిక భవనంతో పాటు.. మండల రిసోర్స్ సెంటర్ భవనాన్ని ఎమ్మెల్యే భాస్కర్​ రావుతో కలిసి గుత్తా ప్రారంభించారు. అనంతరం ఇటీవల మంజూరైన ఎస్టీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి వారు శంకుస్థాపన చేశారు.

గుత్తా మాట్లాడుతూ..

తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని.. రైతులందరూ పంట సాగులో మెళకువలు నేర్చుకోవడానికి, అధికారులతో సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ఈ రైతు వేదిక భవనాలు ఉపయోగకరంగా ఉంటాయన్నారు.

ఇదీ చదవండి:పది మంది భార్యలు.. కోట్ల ఆస్తి.. దారుణ హత్య!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.