నల్గొండ జిల్లా దేవరకొండ పట్టణంలో శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పర్యటించారు. ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌తో కలిసి పలు అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో గ్రంథాలయం, మినీ బస్టాండ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన, మున్సిపాలిటీ కార్యాలయం భవన ప్రారంభోత్సవం చేశారు.
![Legislative Council Chairman Gutha Sukender Reddy visit devarakonda nalgonda district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/9216937_11.png)
రాష్ట్రంలో ఇటీవల కురిసిన అకాల వర్షాలకు భారీ నష్టం వాటిల్లిందని గుత్తా అన్నారు. వరి, పత్తి పంటల నష్టాన్ని సీఎం కేసీఆర్ ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులకు వివరాలు సేకరించాలని ఆదేశించారని తెలిపారు.
దేవరకొండ ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. రోజురోజుకీ పెరుగుతున్న రద్దీ దృష్ట్యా బస్టాండ్ వెనుక స్థలంలో మినీ బస్టాండ్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు.
ఇదీ చూడండి : ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద ప్రవాహం