ముందుగా నిర్ణయం తీసుకున్న ప్రకారం సాగర్ నుంచి శ్రీశైలం లాంచీ ప్రయాణం శనివారం నుంచి కొనసాగుతుందని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించిన అటవీశాఖ అనుమతులు మంజూరు కావడం వల్ల లాంచీ ప్రయాణం రేపే ప్రారంభం కానుంది.
ఆసక్తి ఉన్న పర్యాటకులు ఆన్లైన్లో పర్యాటక శాఖ వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈ ప్రయాణంలో హైదరాబాద్ నుండి సాగర్ వరకు మళ్లీ శ్రీశైలం నుంచి బస్ సౌకర్యం ఉంది. దీనికి పెద్దలకు రూ.2999, పిల్లలకు రూ.2399గా చార్జీలు వసూలు చేస్తున్నారు. భోజనం బస ఏర్పాట్లు కూడా ఉంటాయి.
ఇవీ చూడండి: రాష్ట్ర వ్యాప్తంగా విధుల్లో చేరుతున్న ఆర్టీసీ కార్మికులు