ETV Bharat / state

కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసుల జులం - nal;gonda district news

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టారాయినిపల్లి ప్రాజెక్టు పనులను లక్ష్మణాపురం భూనిర్వాసితులు అడ్డుకునేందుకు యత్నించారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేసి పీఎస్​కు తరలించారు. ఈ క్రమంలో ఇరు వర్గాలకు మధ్య తోపులాట జరిగింది.

landlords of Kishtarainipalli project demands compensation
కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసుల జులం
author img

By

Published : Dec 27, 2020, 4:08 PM IST

నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు పనులను అడ్డుకునే క్రమంలో పోలీసులకు, నిర్వాసితులకు మధ్య తోపులాట జరిగింది. దాదాపు అరగంటకుపైగా జరిగిన ఈ తోపులాటలో పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. ఓ మహిళ పరిస్థితి విషమంగా ఉండటం వల్ల ఆమెను నాంపల్లి ఆస్పత్రికి తరలించారు. పనులను అడ్డుకునేందుకు యత్నించిన భూనిర్వాసితులను అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్​​కు తరలించారు.

కిష్టరాయినిపల్లి ప్రాజెక్టు భూనిర్వాసితులపై పోలీసుల జులం

కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులో భాగంగా లక్ష్మణాపురం గ్రామం ముంపునకు గురవుతోందని, తమకు పరిహారం ఇవ్వకుండానే పనులు చేపట్టారని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరిహారం ఇవ్వకుండా పోలీసు బలగాలను పెట్టి పనులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ వచ్చి తక్షణమే తమ సమస్య పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

కిష్టరాయినిపల్లి ప్రాజెక్టులో భాగంగా.. ముంపునకు గురువుతున్న లక్ష్మణాపురం గ్రామస్థులకు పరిహారం ఇవ్వడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు బలగాలను పెట్టి పనులు చేయిస్తున్నారని ఆరోపించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.