Munugodu byelection campaign by Rajagopala Reddy : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మునుగోడు ఉపఎన్నిక భయం పట్టుకుందని.. అందుకే గిరిజనబంధు తెరపైకి తెచ్చారని భాజపా నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కేసీఆర్‌పై ధర్మయుద్ధంలో గెలిచేది భాజపానేనని విశ్వాసం వ్యక్తం చేశారు.
కేసీఆర్‌ను గద్దె దింపాలంటే మోదీ, అమిత్‌షాలతోనే సాధ్యం: ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారని ఆయన ఆరోపించారు. 1400 మంది యువకులు ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ కుటుంబం రాజకీయ పాలన చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రాజెక్టుల పేరుతో వేల కోట్ల రూపాయలు కేసీఆర్ కుటుంబం దోపిడి చేసిందని ఆయన అన్నారు. కేసీఆర్‌ను గద్దె దింపాలంటే మోదీ, అమిత్‌షాలతోనే సాధ్యం అవుతుందని తెలిపారు.
మునుగోడు ఉప ఎన్నిక కోసమే గిరిజన బంధు పథకం: తనను రాజకీయంగా ఎదర్కొలేక తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. మునుగోడు ఉపఎన్నికను ప్రపంచంలో ఉన్న తెలుగు వారందరు గమనిస్తున్నారని ఆయన తెలిపారు. తన రాజీనామాతో ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను ఈరోజు మునుగోడుకి రప్పించానని అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బందు పథకం పెట్టారు... మునుగోడు ఉప ఎన్నికకు గిరిజన బంధు పథకం తెస్తున్నారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల కోసమే రాజీనామా: కుటుంబ పాలన అంతం కావాలంటే మునుగోడు ఉపఎన్నికలో భాజపాను గెలిపించాలని కోరారు. నారాయణపూర్ మండలంలోని వివిధ గ్రామాల నుంచి 500 మంది భాజపాలో చేరారు. వీరికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన రాజగోపాల్ రెడ్డి తెలంగాణ ప్రజల కోసమే తాను రాజీనామా చేశానని పునరుద్ఘాటించారు.
"ప్రతిపక్షం లేకుండా కేసీఆర్ ప్రజాస్వామ్యన్ని ఖూనీ చేశారు. 1400 మంది యువకులు ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడితే కేసీఆర్ కుటుంబం రాజకీయ పాలన చేస్తోంది. కేసీఆర్‌ను గద్దె దింపాలంటే మోదీ, అమిత్‌షాలతోనే సాధ్యం.. నా రాజీనామాతో ఫామ్‌హౌస్‌లో ఉన్న కేసీఆర్‌ను ఈరోజు మునుగోడుకి రప్పించాను. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో దళిత బందు పథకం పెట్టారు... మునుగోడు ఉప ఎన్నికకు గిరిజన బంధు పథకం తేస్తున్నారు. తెలంగాణ ప్రజల కోసమే నేను రాజీనామా చేశాను." - కోమటి రెడ్డి రాజగోపాలరెడ్డి, భాజపా నేత
ఇవీ చదవండి: