నల్లగొండ జిల్లా చండూరు మండలం బొడంగిపర్తిలో రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు పల్లె రవికుమార్ తండ్రి దశదిన కర్మ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు పాల్గొన్నారు.
మంత్రి శ్రీనివాస్ గౌడ్, మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు మధు యాష్కీ గౌడ్, తెలంగాణ ఇంటి పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చెరుకు సుధాకర్, భువనగిరి మాజీ పార్లమెంటు సభ్యులు బూర నర్సయ్య గౌడ్లు హాజరయ్యారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి చెరుకు సుధాకర్ గౌడ్‌తో మీరు తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేశారని రాజగోపాల్ రెడ్డి అన్నారు. మిగతా పోటీదారులు కూడా ఏకాభిప్రాయంతో వచ్చి ఆయనకు సపోర్ట్ చేయాలని కోరారు. అందరూ కలిసి తెరాసను ఓడించాలని తెలిపారు. చెరుకు సుధాకర్ గౌడ్ గెలుపుకు తన పూర్తి సహకారం ఉంటుందని రాజగోపాల్ రెడ్డి పేర్కొన్నారు.
ఇదీ చూడండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. విజయవంతం