నల్గొండ జిల్లా కేంద్రంలో ఆర్టీసీ కార్మికులు సామూహిక నిరాహారదీక్ష చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆర్టీసీ కార్మికులను కడుపులో పెట్టుకుని చూసుకుంటానని నమ్మించి సీఎం కేసీఆర్ మోసం చేశారని మండిపడ్డారు. తమను పక్కనపెట్టి అద్దె బస్సులతో నడుపుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు. వేతన సవరణ అమలు చేసి డ్రైవర్,కండక్టర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. మహిళా కండక్టర్లకు రాత్రి తొమ్మిది గంటలలోపు వచ్చే డ్యూటీలనే ఇవ్వాలని కోరారు.
'మమ్మల్ని కేసీఆర్ నమ్మించి మోసం చేశాడు' - సామూహిక నిరాహార దీక్ష
ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక బస్టాండ్ ఆవరణలో కార్మికులు సామూహిక నిరాహార దీక్ష చేపట్టారు. సిబ్బందిపై పెంచిన పని భారం వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు.