నాగార్జునసాగర్ ఉప ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో నిమగ్నమయ్యాయి. మాజీ మంత్రి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి నల్గొండ జిల్లా నిడమనూరు మండలంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ఆయన సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.
తెరాస ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఆ నాయకులు మర్చిపోయారని ఆయన విమర్శించారు. నిరుద్యోగ భృతి, డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం, రైతు రుణమాఫీ సహా అనేక అంశాలు.. అమలు చేయడంలో విఫలమయ్యారని ఆయన దుయ్యబట్టారు.
సాగర్ నియోజకవర్గ పరిధిలో జానారెడ్డి చేసిన అభివృద్ధి తప్ప మరొకరు చేయలేదన్నారు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం గడిచిన ఆరేళ్లలో ఏం పనులు చేసిందో చెప్పాలన్నారు. తండాల్లోని చిన్న గ్రామాల్లో రోడ్లు, విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తెచ్చింది జానారెడ్డి కాదా అని తెలిపారు. సాగర్లో అభివృద్ధి జరగాలి అంటే మళ్లీ తననే గెలిపించాలని కోరారు.
ఇదీ చూడండి : గన్తో తెరాస నాయకుడి హల్చల్