IT Raids in Nalgonda District : నల్గొండ జిల్లా, మిర్యాలగూడలో ఐటీ దాడులు కలకలం రేపుతున్నాయి. రైస్ మిల్లులే టార్గెట్గా ఐటీ దాడులు (IT Raids) కొనసాగుతుండటం గమనార్హం. రెండో రోజూ రైస్ మిల్లులపై ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. వరుస దాడులతో రైస్ మిల్ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. మిర్యాలగూడ సాగర్ రోడ్డు, ఖమ్మం రోడ్లలో ఉన్న రైస్ మిల్లులపై ఏకకాలంలో ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
కాంగ్రెస్ నేతలపై ఐటీ దాడులు జరగొచ్చు - ఆందోళన వద్దు : పొంగులేటి
ఆరు బృందాలుగా ఏర్పడిన ఐటీ అధికారులు గురువారం మధ్యాహ్నం నుంచి ఆరు రైస్ మిల్లుల్లో విస్తృతంగా సోదాలు చేస్తున్నారు. ఆయా రైస్ మిల్లులో రికార్డులు తనిఖీ చేయడంతో పాటు బ్యాంకు లావాదేవీలు, ధాన్యం కొనుగోలు రికార్డులను పరిశీలిస్తున్నారు. ఈరోజు సాయంత్రం వరకు ఐటీ అధికారుల సోదాలు జరిగే అవకాశం ఉంది.
తెలంగాణలో ఐటీ సోదాల కలకలం - ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఇంట్లో తనిఖీలు
IT Raids in Nalgonda Rice Mills : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల (Telangana Elections) సమయంలో పలు రైస్ మిల్లులతోపాటు మిల్లు యాజమానుల ఇళ్లల్లో, నాటి అధికార బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఓ కాంట్రాక్టర్ ఇంటిపైన వరుస దాడులు జరిపిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన నెలరోజుల వ్యవధిలోని మళ్లీ ఐటీ అధికారులు రైస్ మిల్లులపై సోదాలు నిర్వహించడంతో వ్యాపార వర్గాలలో చర్చనీయాంశమైంది.
హైదరాబాద్‌లో మరోసారి ఐటీ దాడుల కలకలం - ప్రముఖ ఫార్మా కంపెనీ డైరెక్టర్ల ఇళ్లల్లో సోదాలు!
నవంబర్ నెలలో అసెంబ్లీఎన్నికల ముందు మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు బంధువుల ఇళ్లపై, మరికొన్ని రైస్ మిల్లులపైనా ఐటీ దాడులు జరిగాయి. అది మరవక ముందే గురువారం ఆరు రైస్ మిల్లులలో ఏకధాటిగా ఐటీ తనిఖీలు కొనసాగుతుండడంతో పట్టణ ప్రజల్లో చర్చనీయాంశమైంది.
ఒడిశాలో మరో 20బ్యాగుల నోట్ల కట్టలు సీజ్- మొరాయిస్తున్న క్యాష్ కౌంటింగ్ మెషిన్లు- చేసేదేం లేక!!
IT Raids at Miryalaguda Rice Mills : నల్గొండ జిల్లా, మిర్యాలగూడలోని పలు రైస్ మిల్లులో నిన్నటి నుంచి ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. మిర్యాలగూడలోని సాయి జయలక్ష్మి రైస్ మిల్, సూర్య రైస్ ఇండస్ట్రీస్, వైష్ణవి ఫుడ్ ప్రోడక్ట్, సాంబశివ రైస్ ఇండస్ట్రీస్, ఆర్ఎస్వి రైస్ ఇండస్ట్రీస్ మొత్తం ఆరు రైస్ ఇండస్ట్రీలలో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. రైస్ మిల్లులలో రైతులకు చెల్లించిన బకాయిలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నుల వివరాలను ఐటీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
IT Raids in Hyderabad : బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లలో మూడో రోజూ ఐటీ సోదాలు