ETV Bharat / state

ఏ చట్టం ప్రకారం ఆస్పత్రిని సీజ్​ చేశారు: చెరుకు సుధాకర్​ - inti party president spoke on hospital seized in nalgonda

నల్గొండలోని నవ్య ఆస్పత్రిని ఏ ఆధారాలతో సీజ్​ చేశారని ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎవరో చిన్న కాగితం ముక్కపై ఎక్కువ ఫీజులు వసూలు చేశారని చేసిన ఆరోపణలపై ఆస్పత్రిని ఎలా సీజ్​ చేస్తారని మండిపడ్డారు. ఆస్పత్రి, వైద్యులపై పెట్టిన కేసును విత్​డ్రా చేయాలని డిమాండ్​ చేశారు.

inti party president spoke on hospital seized in nalgonda
ఏ చట్టం ప్రకారం ఆస్పత్రిని సీజ్​ చేశారు: చెరుకు సుధాకర్​
author img

By

Published : Aug 23, 2020, 5:35 PM IST

నల్గొండ జిల్లా కేంద్రంలోని కరోనా బాధితుడి నుంచి లక్షల్లో డబ్బులు వసూలు చేశారని ఆరోపిస్తూ నవ్య ఆస్పత్రిని సీజ్​ చేయడంపై ఇంటిపార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్​ తీవ్రంగా మండిపడ్డారు. పేద ప్రజలకు అతితక్కువ ఫీజులు తీసుకుంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తుంటే... ఎటువంటి ఆధారాలు లేకుండా ఎవరో చిన్న కాగితం ముక్కపై ఎక్కువ బిల్లు వసూలు చేసినట్లు వచ్చిన ఆరోపణలో వాస్తవం ఏంటనేది తెలుసుకోకుండా ఆస్పత్రిని ఎలా సీజ్ చేస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

పైగా ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా... ఏ చట్టం ప్రకారం ఆస్పత్రిని సీజ్ చేశారని మండిపడ్డారు. హైదరాబాద్​లోని పలు ప్రవేట్ ఆస్పత్రుల్లో న్యాయవాదులు, మెజిస్ట్రేట్​ల నుంచి లక్షల్లో కరోనా బిల్లు వసూలు చేస్తున్న వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని ప్రశ్నించారు. కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చక పోవడం వల్ల కొన్ని వందల కోట్లు ప్రైవేట్​ ఆసుపత్రుల పాలవుతున్నాయని ఆరోపించారు. ఆస్పత్రి, వైద్యులపై పెట్టిన కేసును విత్ డ్రా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై హైకోర్టు, రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకెళ్తానని ఆయన అన్నారు.

ఇవీ చూడండి: 'రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్య పెంచాల్సిన అవసరం ఉంది'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.