నల్గొండ జిల్లా నాగార్జునసాగర్ జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా.. ప్రస్తుత 506.80 అడుగులకు చేరుకుంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 126.301 టీఎంసీలు గా ఉంది. ప్రస్తుతం సాగర్ జలాశయానికి నీటి ప్రవాహం ఏమీ లేదు. 837 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం హైదరాబాద్కు తరలిస్తున్నారు. కృష్ణమ్మ ఎగువ ప్రాంతంలో వరద నీరు ఎక్కువ కావడం వల్ల సాగర్ జలాశయం ఆయకట్టు కింద రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాబోయే రోజుల్లో వరద అధికంగా వస్తే వాటికి చేపట్టాల్సిన చర్యలను అధికారులు సిద్ధం చేస్తున్నారు.
ఇవీ చూడండి: కృష్ణాకు గోదావరి జలాలపై త్వరలో కార్యాచరణ..!