స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో నల్గొండ శాసనసభ్యుడు కంచర్ల భూపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పమయ్యాయి. కనగల్ మండలం తుర్కపల్లి, హజిలాపురం గ్రామాల్లో పర్యటించిన సమయంలో కొంత మంది ఎమ్మెల్యే ఎదుట నిరసన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి నీళ్లు రావడం లేదంటూ నినాదాలు చేశారు. మొదట్లో ఇది మంచి పద్ధతి కాదని సర్దిచెప్పడానికి ఎమ్మెల్యే ప్రయత్నించారు. గ్రామస్థులు ఎంతకి వినకపోవడం వల్ల ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ' ఎన్నికలయ్యాక నేనేంటో చూపిస్తా' నంటూ పరుషమైన వ్యాఖ్యలు చేశారు. ఓట్లు అభ్యర్థించడానికి వచ్చిన ఎమ్మెల్యే ఇలాంటి పదజాలం వాడడం అక్కడున్నవారిని ఆశ్చర్యానికి గురిచేసింది.
ఇవీ చూడండి: లారీని ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురి పరిస్థితి విషమం