కరోనా చేనేత కార్మికులను రోడ్డున పడేసింది. చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలంటూ నల్గొండ జిల్లా చండూరు పట్టణంలో నేతన్నలు చేపట్టిన రిలే నిరాహార దీక్షలు నేటితో 49వ రోజుకు చేరుకున్నాయి. నేడు పట్టణ కేంద్రంలోని చౌరస్తాలో గల వాటర్ ట్యాంక్ ఎక్కి చేనేత కార్మికులు నిరసన తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి భరోసా లభించకపోవడం వల్ల నేతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా సర్కారు స్పందించి చేనేత కార్మికులను ఆదుకోవాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: ఆదర్శానికి నిలువెత్తు ఆ ఉపాధ్యాయులు...