ETV Bharat / state

Gutha Sukender Reddy: ' చుక్క నీటినీ వదిలే ప్రసక్తే లేదు' - గుత్తా సుఖేందర్ రెడ్డి తాజా వార్తలు

తెలంగాణపై కుట్ర చేయాలనే ఉద్దేశంతోనే.. నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం గెడిట్ విడుదల చేసిందని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆరోపించారు. రాష్ట్రానికి వచ్చే ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోమని తెలిపారు.

gutha-sukender-reddy-responds-on-gazette
'తెలంగాణకు వచ్చే ఒక్క నీటి చుక్కని వదులుకోం'
author img

By

Published : Jul 18, 2021, 1:38 PM IST

Updated : Jul 18, 2021, 1:57 PM IST

కృష్ణా నదీ జలాల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గెజిట్​ నోటిఫికేషన్​ను తాను పూర్తిగా వ్యతిరేకిస్తున్నానని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్రానికి వచ్చే ఒక్క నీటి చుక్కను కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తుందని.. రాష్ట్రం బాగుపడటం భాజపాకి ఇష్టం లేదని ఆయన ఆరోపించారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని గుత్తా అన్నారు. నదీ జలాలకు సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ విడదల చేయడం దారుణమన్నారు. రాష్ట్రాన్ని భాజపా ప్రభుత్వం ఎడారిగా మార్చాలని చూస్తోందని ఆరోపించారు.

గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం చాలా దారుణం. నేను దానిని పూర్తిగా వ్యతిరేకిస్తున్న. తెలంగాణకు వచ్చే ఒక్క చుక్క నీటిని కూడా వదులుకోము. తెలంగాణ బాగుపడొద్దనే ఉద్దేశంతోనే... కేంద్ర ప్రభుత్వం కుట్రపూరిత చర్యలు చేస్తోంది. రాష్ట్రానికి నీళ్లు రాకుండా చేసి... తెలంగాణను ఏడారిగా మార్చాలని చూస్తోంది. నిజాం రాజులు కట్టిన మూసి, డిండి ప్రాజెక్టులను గెజిట్​లో పొందుపరచడం ఆశ్చర్యంగా ఉంది. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ బాగు కోరుకునే వారైతే... ఈ గెజిట్​ను వ్యతిరేకించాలి. కాంగ్రెస్, భాజపా, వైఎస్సార్​ పార్టీ పెట్టిన షర్మిల అందరూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు కుట్ర చేస్తున్నారు. వాళ్లు ఎన్ని ఎత్తులు వేసినా... అధికారంలోకి వచ్చేది మేమే.

- గుత్తా సుఖేందర్ రెడ్డి, మండలి ఛైర్మన్

నిజాం రాజులు కట్టిన మూసి, డిండి ప్రాజెక్టులను కూడా గెజిట్​లో పొందుపరచడం ఆశ్చర్యంగా ఉందని.. కేంద్రానికి తెలియకుండా ఒక్కచుక్క నీరు కూడా వాడుకోవద్దనడం కుట్రపూరిత చర్యని గుత్తా పేర్కొన్నారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ బాగు కోరుకునే వారే అయితే ఈ గెజిట్​ను వ్యతిరేకించాలని సూచించారు. త్వరలోనే భాజపాకి తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని అన్నారు. కాంగ్రెస్, భాజపా, వైఎస్​ఆర్ టీపీ తెలంగాణలో అధికారంలోకి రావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా... ప్రజలు మాత్రమే తెరాసకే పట్టం కడతారని ఆశాభావం వ్యక్తం చేశారు.

ఇదీ చూడండి: Yadadri Temple: యాదాద్రిలో భక్తుల కిటకిట.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..

Last Updated : Jul 18, 2021, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.