తెరాస ప్రభుత్వం ఆలయాల అభివృద్ధికి తగిన సహకారం అందిస్తోందని శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి ఆలయ పునర్నిర్మాణానికి పెద్ద మొత్తంలో నిధులు విడుదల చేసిందని గుర్తుచేశారు. నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లిలో కొలువై ఉన్న శ్రీ పద్మావతి, అలివేలు మంగ సమేత వెంకటేశ్వర స్వామివారి తిరు కల్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొన్నారు.
ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మారేపల్లి ఆలయంలో శాశ్వత కల్యాణ మండపం నిర్మించాలని ఆలయ కమిటీ కోరిందని... ప్రభుత్వం తరఫున తగిన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రజలంతా సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కల్యాణంలో జానారెడ్డి కుమారుడు జైవీరు రెడ్డి, నోముల నర్సింహయ్య కుమారుడు భగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: జాతరమ్మ జాతర... పెద్దగట్టు జాతర!