ETV Bharat / state

ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెరిగిన భూగర్భ నీటిమట్టాలు - భూగర్భ జలాలు

ఉమ్మడి నల్గొండ జిల్లా.. నాగార్జున సాగర్‌ చెంతనే ఉన్నా.. సాగు, తాగునీటికి కటకటలాడిన ప్రాంతం.. కరవు కోరల్లో చిక్కుకుని రైతులు విలవిలలాడిన నేల.. సాగునీటి కోసం ఈ ప్రాంత రైతలు వెతలు అన్నీఇన్నీకావు.. బోర్ల కోసం చేసిన అప్పులు తీరక ఎందరో రైతుల గుండెలు ఆగిపోయాయి. అలాంటి నేలలో ఇప్పుడు జలసిరులు పొంగుతున్నాయి. భూగర్భ జలాలు ఉబికి వస్తూ రైతుల ఇంట సిరులు పండుతున్నాయి.

water
భూగర్భ నీటిమట్టాలు
author img

By

Published : May 18, 2021, 10:24 PM IST

ఎండాకాలం చివరలోనూ ఉమ్మడి నల్గొండ జిల్లావ్యాప్తంగా.. భూగర్భ జలాలకు లోటు కనిపించడంలేదు. గతేడాదితో పోలిస్తే నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో.. నీటి లభ్యత 3 మీటర్లకు పైగా ఎగువకు చేరింది. సూర్యాపేట జిల్లాలో గతేడాది ఏప్రిల్‌తో పోలిస్తే... ఈ ఏప్రిల్లో స్వల్ప స్థాయిలో పెరుగుదల ఉంది. కొన్ని జిల్లాలు మినహాయిస్తే ఈ ఏప్రిల్ వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం.. 46 శాతం అధికంగా నమోదైందని భూగర్భ జల శాఖ నివేదిక పేర్కొంది. వర్షపాతం అధికంగా నమోదైన జాబితాలో.. నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాలు ఉన్నాయి. నీటి లభ్యత గత సంవత్సర కాలంగా వృద్ధి చెందుతుండటం వల్ల... ఉమ్మడి జిల్లాలో పెద్ద ఎత్తున పంటలు సాగవుతున్నాయి. గత యాసంగిలో 10 లక్షల ఎకరాల్లో వరి వేయగా.. 20 లక్షల మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం చేతికి అందింది.

సూర్యాపేట జిల్లాలో పెరిగిన జలమట్టం

ఈ ఏడాది మార్చితో పోలిస్తే ఏప్రిల్‌లో నల్గొండ, యాదాద్రి జిల్లాల్లో స్వల్పంగా భూగర్భమట్టాలు తగ్గిపోయాయి. సూర్యాపేట జిల్లాలో మాత్రం పెరిగాయి. నల్గొండ జిల్లాలో మార్చిలో 7.42 మీటర్ల లోతులో ఉన్న జలాలు... ఏప్రిల్లో 7.9 మీటర్లకు పడిపోయాయి. ఈ లెక్కన 0.48 మీటర్ల మేర నీరు తగ్గింది. యాదాద్రి జిల్లాలో గత మార్చిలో 7.18 మీటర్లలో జలాలు ఉండగా.. ఏప్రిల్‌కు వచ్చేసరికి 0.75 మీటర్లు తగ్గి 7.93 మీటర్లుగా నమోదైంది. సూర్యాపేట జిల్లాలో మాత్రం మార్చిలో 6.35 మీటర్ల లోతులో ఉన్న భూగర్భజలాలు... ఏప్రిల్‌లో 5.97 మీటర్లకు చేరుకుని 0.38 మీటర్ల మేర వృద్ధి చెందాయి. ఎస్సారెస్పీ నీటి విడుదలతో చెరువులు, కుంటలు నిండటం, నాగార్జునసాగర్ ఎడమ కాల్వతోపాటు దాని మీద ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాల వల్ల.. ఈసారి భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా పెరిగాయని అధికారులు అంచనాకొచ్చారు.

ఇదీ చదవండి: రాష్ట్రంలో లాక్‌డౌన్‌ పొడిగించిన ప్రభుత్వం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.