ETV Bharat / state

హుజూర్​నగర్​ తుది సమరంలో 28 మంది...

హుజూర్​నగర్​ ఉప ఎన్నికలకు 76 నామినేషన్లు దాఖలవగా 28 మంది తుది పోరులో నిలిచినట్లు అధికారులు తెలిపారు. పరిశీలనలో 45 నామపత్రాలు తిరస్కరణకు గురవగా.. ముగ్గురు స్వతంత్రులు నామపత్రాలను ఉపసంహరించుకున్నారు.

హుజూర్​నగర్​ తుది సమరంలో 28 మంది...
author img

By

Published : Oct 4, 2019, 5:01 AM IST

Updated : Oct 4, 2019, 7:33 AM IST

హుజూర్​నగర్​ తుది సమరంలో 28 మంది...

హుజూర్​నగర్ ఉప ఎన్నికలకు 28 మంది బరిలో నిలిచారు. మొత్తం 31 మంది పోటీకీ అర్హత సాధించగా... అందులో ముగ్గురు తమ నామపత్రాలను గురువారం ఉపసంహరించుకున్నారు. ఈ ఎన్నికలకు అత్యధికంగా 76 నామినేషన్లు, 119 సెట్లు దాఖలు కాగా... 45 మంది తిరస్కరణకు గురయ్యారు. ప్రస్తుతం 28 మంది పోటీలో నిలవటం వల్ల రెండు ఈవీఎంలు ఉపయోగించాల్సి ఉంటుంది.

తిరస్కరణకు గురైన సీపీఎం అభ్యర్ధి నామినేషన్

ఉప ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ గడువు సమయం ముగిసిన తర్వాత 28 మంది పోటీలో ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 31 మంది బరిలో ఉండగా అందులో ముగ్గురు స్వతంత్రులు నామపత్రాల్ని ఉపసంహరించుకున్నారు. ఫలితంగా ఈ నెల 21న జరగనున్న ఉప ఎన్నికలకు మొత్తం 45 నామపత్రాలు తిరస్కరణకు గురయ్యాయి. ఇందులో ప్రధాన పార్టీ అయిన సీపీఎం అభ్యర్థి పారేపల్లి శేఖర్ పత్రాలు కూడా తిరష్కరణకు గురయ్యాయి.

నిజామాబాద్ తర్వాత ఇక్కడే

నిజామాబాద్ తర్వాత అత్యధికంగా నామపత్రాలు దాఖలైంది హుజూర్​నగర్​లోనేనని అధికారులు వెల్లడించారు. ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోకూడదని భావిస్తున్న రెండు ప్రధాన పార్టీలు అసంతృప్త నేతలపై దృష్టి సారించాయి. 31 మంది అభ్యర్థుల జాబితా నుంచి ముగ్గురు అభ్యర్థులు నామపత్రాలను ఉపసంహరించుకోగా 28 మంది తుది పోరుకు బరిలో నిలిచారు.

ఇవీ చూడండి: "హుజూర్​నగర్"పై కేంద్ర ఎన్నికల సంఘానికి భాజపా ఫిర్యాదు

Last Updated : Oct 4, 2019, 7:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.