Farmers Protest against Land Acquisition: నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం బలవంతంగా భూములు లాక్కోవద్దని వరంగల్ జిల్లా దామోర మండలం పసరగొండ వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. సర్వే కోసం వచ్చిన అధికారులను భూనిర్వాసితులు అడ్డుకున్నారు. పచ్చని పొలాల మధ్య రోడ్లు వేస్తూ రైతుల పొట్ట కొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పరిహరం చెల్లించే వరకు సర్వే చేయనీయబోమని తేల్చి చెప్పారు.
మార్కెట్ ధర చెల్లించాలి
సర్వే కోసం వచ్చిన అధికారులతో అన్నదాతలు వాగ్వాదానికి దిగారు. పంట పొలాల నుంచి నేషనల్ గ్రీన్ ఫీల్డ్ హైవే కోసం ప్రభుత్వం జరిపే బలవంతపు భూసేకరణ నిలిపి వేయాలని పేర్కొన్నారు. ఒక వేళ బలవంతపు భూసేకరణ చేస్తే.. మార్కెట్ ధర ప్రకారం పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.... రైతులకు నచ్చజెప్పేందుకు యత్నించారు.
ఇదీ చదవండి: ఈ ఆర్థిక ఏడాది నాబార్డ్ రుణ ప్రణాళిక విడుదల.. ఎన్ని కోట్లు అంటే.?