నల్గొండ జిల్లా మునుగోడులో అఖిలపక్ష పార్టీలు, రైతు సంఘాల నాయకులు ధర్నాకు దిగారు. మునుగోడు, చండూర్లలో మూసివేసిన సీసీఐ కొనుగోలు కేంద్రాలను పున:ప్రారంభించాలంటూ డిమాండ్ చేశారు.
జిల్లాలోనే అత్యధికంగా పత్తిని సాగు చేసే ప్రాంతం మునుగోడు మండలం అయినప్పటికీ.. ఇక్కడి సీసీఐ కేంద్రాలను తొందరగా మూసివేశారని రైతులు ఆరోపించారు. మార్కెట్ ఏడీ ఘటానా స్థలికి చేరుకుని కొనుగోలు కేంద్రాలను తిరిగి ప్రారంభిస్తామని హామీ ఇవ్వడం వల్ల ధర్నా విరమించారు.
ఇవీ చూడండి: పోరు దిశగా కాంగ్రెస్... నిలువరించే పనిలో తెరాస