నల్గొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెంలో జరుగుతున్న ముత్యాలమ్మ జాతరలో సీఎల్పీ మాజీ నేత జానారెడ్డి పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ఆశీర్వాదం పొందారు. గిరిజనుల ఆరాధ్య దేవత ముత్యాలమ్మ జాతర.. ప్రతి రెండేళ్లకోసారి ఘనంగా నిర్వహిస్తారని జానారెడ్డి తెలిపారు. వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారికి మొక్కలు చెల్లించుకుంటారని చెప్పారు.
ఇక్కడి అమ్మవారిని పూజిస్తే సంతానం కలుగుతుందని భక్తులు నమ్ముతారని జానారెడ్డి తెలిపారు. పాడి పంటలు బాగా సమృద్ధిగా ఉంటాయని రైతులు భావిస్తారని జానారెడ్డి చెప్పారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని ముత్యాలమ్మను వేడుకున్నట్లు పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : ముత్యాలమ్మ గుడిలో చోరీ.. ఇదిగో వీడియో..