ధాన్యం అమ్ముకునేందుకు అధికారులు ఇచ్చే టోకెన్ల కోసం రైతులు బారులు తీరుతున్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్‌తో పాటు వేములపల్లి ఎంపీడీవో కార్యాలయం వద్ద ఉదయం నుంచి పడిగాపులు కాస్తున్నారు. ఈనెల 11 నుంచి జారీ చేస్తోన్న టోకెన్ల కోసం 10 నుంచే పేర్లు నమోదు చేసుకుంటున్నారు. ముందు చెప్పిన రోజు కాకుండా ఈనెల 16న టోకెన్లు ఇస్తామని చెప్పడంతో అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నవంబర్ 10న నమోదు చేసిన వ్యక్తుల్లో కేవలం వంద మందికి టోకెన్లు ఇవ్వగలిగామని... మిగతా వారికి విడతల వారీగా ఇవ్వాల్సి ఉంటుందని అధికార యంత్రాంగం పేర్కొంది.
"నాకు రెండెకరాల పొలం ఉంది. 11 తారీఖు ఉదయం 7గంటలకు వచ్చి నిలబడితే 16కి టోకెన్ ఇస్తున్నారు. ఈ ఐదు రోజులు ధాన్యాన్ని ఎక్కడ ఉంచాలి? ఎలా కాపాడుకోవాలి?."
- రైతు
"నాలుగు రోజుల నుంచి టోకెన్ల కోసం తిరుగుతున్నాం. ఇంతవరకు అందలేదు. వరిని ఏం చేయాలి. సన్న ధాన్యం వల్లే ఇంత నష్టం జరిగింది. ఒకే టోకెన్ ఇస్తే ఉన్న ధాన్యం అంతా ఎలా అమ్మాలి? ధాన్యం పాడవుతుందని తక్కువ ధరకే మిల్లర్లకు అమ్ముకోవాల్సి వచ్చింది."
-మహిళా రైతు
ఇదీ చదవండి: దోబూచులాడుతున్న ధాన్యం కొనుగోలు మాట... పావుగా మారుతున్న అన్నదాత