రాష్ట్రంలో కరోనా విజృంభిస్తున్నా పట్టించుకోకుండా సీఎం కేసీఆర్.. ఫాంహౌస్‌కే పరిమితమయ్యారని మాజీ ఎంపీ, భాజపా నేత వివేక్ వెంకటస్వామి విమర్శించారు. కరోనా విషయంలో ప్రధాని ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంటే రాష్ట్రంలో కేసీఆర్... ప్రతిపక్షాలతో చర్చించకుండా ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా నల్గొండలోని భాజపా కార్యాలయంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలోని 33 వార్డులో మొక్కలు నాటారు.
ఏపీలో 5 లక్షల కరోనా పరీక్షలు చేస్తుంటే మన రాష్ట్రంలో కేవలం 60 వేలు మాత్రమే చేశారు. సూర్యాపేటలో కరోనా పరీక్షలు చెయ్యకుండా వదిలేశారు. విమర్శలు వచ్చాయనే కర్నాల్ సంతోశ్ బాబు కుటుంబాన్ని పరామర్శించారు.
-వివేక్ వెంకటస్వామి, మాజీ ఎంపీ, భాజపా నేత
ఇదీ చూడండి: అమెజాన్‌లోనూ ఇక మద్యం హోం డెలివరీ!