Head Found With Out Body: నల్గొండ జిల్లా చింతపల్లి మండలం విరాట్‌నగర్ కాలనీ అమ్మవారి విగ్రహం వద్ద... మనిషి తల దొరికి మూడ్రోజులవుతున్నా... ఇప్పటివరకు మొండెం ఆచూకీ లభించలేదు. హతుడు జైహింద్ నాయక్ మతిస్తిమితం కోల్పోవడం, సెల్‌ఫోన్ ఉపయోగించకపోవడం, చివరిసారిగా అతణ్ని చూసినవారు లేకపోవడం... తదితర కారణాల వల్ల హత్యకేసులో ఆధారాలు లభించడంలేదు.
ఐదారేళ్లుగా జైహింద్ జీవనశైలిపై అతడి తల్లిదండ్రులను ప్రశ్నించిన పోలీసులు... పూర్తి వివరాలు తెలుసుకున్నారు. ఆరేళ్లుగా గ్రామానికి ఏడాదికి ఒకటి రెండుసార్లు వచ్చాడని జైహింద్ తండ్రి శంకర్ నాయక్... పోలీసులకు చెప్పినట్లు సమాచారం. దీంతో హత్యకు గ్రామానికి చెందిన వ్యక్తులకు సంబంధం లేదని నిర్ధరించుకున్న పోలీసులు... తుర్కయాంజల్ పరిధిలో గుప్తనిధులు, నరబలి నేపథ్యంలో నమోదైన కేసుల గురించి విచారిస్తున్నారు. మొండెం కోసం ఇబ్రహీంపట్నంతో పాటు నల్గొండ జిల్లా చింతపల్లి, మర్రిగూడ మండలాల్లో పోలీసులు వెతుకుతున్నారు.
ఇదీ చదవండి: అమ్మవారి పాదాల వద్ద మొండెం లేని తల.. హత్యా...? నరబలా..?