నల్గొండ జిల్లా అనుముల మండలం హాలియాలోని శ్రీ లక్ష్మీనరసింహ ఫంక్షన్ హాల్లో నియంత్రిత సాగు విధానంపై సదస్సు నిర్వహించారు. నియోజకవర్గ స్థాయిలో జరిగిన సదస్సుకు జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
అందుకే గిట్టుబాటు రావట్లేదు మరి !
రైతులందరూ ఒకే పంటను పండించడం వల్ల గిట్టు బాటు ధర రాకుండా పోతోందని.. అందుకే పంట మార్పిడి చేసి మెట్ట పంటలు సహా కంది, పెసర, మినుము, జొన్న , మొక్కజొన్న, కూరగాయలు, నూనె గింజల పంటలను సాగు చేయాలని మంత్రి కోరారు.
జీఓ 203ని వ్యతిరేకిస్తున్నాం : మంత్రి
అనంతరం ఏపీ ప్రభుత్వం ఇచ్చిన 203 జీవోను రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకిస్తోందని మంత్రి పేర్కొన్నారు. కాంగ్రెస్ నేతల పాలనలోనే జల దోపిడీ జరిగితే నోరు మెదపకుండా ఉన్నారని విమర్శించారు. పెద్ద నాయకులని చెప్పుకునే నేతలు పదవులు, బి-ఫారాలా కోసం కిక్కురుమనకుండా ఉన్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య, ఎమ్మెల్సీ చిన్నపరెడ్డి, వ్యవసాయ శాఖ అధికారులు, రైతు బంధు జిల్లా అధ్యక్షుడు, మండల రైతు బంధు సమన్వయకర్తలు, రైతులు పాల్గొన్నారు.
ఇవీ చూడండి : 'మీరు ఎన్ని తప్పులు చేసినా... మీ మీద కరోనా కేసులు లేవు'