ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారి వైద్య ఖర్చులకు తమ వంతు సాయం అందిస్తామని దాతలు ముందుకు వస్తున్నారు. 'చిన్నారి గుండెకు కష్టం.. మానవత్వమే ఔషధం' అనే శీర్షికతో ఈనాడు దినపత్రికలో ఈ నెల 17న ప్రచురితమైన మానవీయ కథనానికి పలువురు దాతలు స్పందించారు. ఈటీవీ భారత్‌లో ఇదే చిన్నారిపై ఆపన్న హస్త్ ఫౌండేషన్ సెక్రటరీ వెంపటి విజయ్ కుమార్ గవర్నర్‌కు ట్వీట్ చేసిన అంశంపై ప్రచురితమైన కథనానికి నిర్మాత బండ్ల గణేశ్ స్పందించి తోచిన సాయం చేశారు.
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం బాలశెట్టి గూడెంకు చెందిన సైదులు, జ్యోతి దంపతుల రెండు నెలల చిన్నారి గుండె, ఊపిరితిత్తుల సమస్యతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. దాతలు ఆర్దికంగా సహకరిస్తే చిన్నారి ప్రాణాలు దక్కుతాయని "ఈనాడు-ఈటీవీ భారత్" శుక్రవారం వెలుగులోకి తెచ్చింది. చికిత్సకోసం సుమారు నాలుగున్నర లక్షల రూపాయలు ఖర్చవుతుందని చిన్నారి తల్లిదండ్రులు తెలపడంతో దాతలు ఆర్థిక సహాయం అందించారు. ఇప్పటివరకు దాతలు 47 వేల రూపాయలు ఆర్దిక సహాయం అందించారు. మరిన్ని నిధులు అవసరమున్న నేపథ్యంలో దాతలు సంప్రదించాలని చిన్నారి తల్లిదండ్రులు అర్థిస్తున్నారు.
దాతలు హెల్ప్ లైన్ నెం : 9676488878 (ఈనాడు) ను సంప్రదించాలని కోరుతున్నారు.
ఇవీ చూడండి: 'కడుపు నింపే రైతు.. కడుపు రగిలి కాళ్లు పట్టుకున్నాడు'