నల్గొండ జిల్లాలో డిండి ఎత్తిపోతల పథకం(dindi lift irrigation project)లో భాగంగా చర్లగూడెం వద్ద చేపడుతున్న రిజర్వాయర్ పనులను భూ నిర్వాసితులు అడ్డగించారు. ప్రాజెక్టు మొదలై నేటికి ఆరేళ్లు పూర్తి కావొస్తున్నా ఇప్పటికీ పరిహారం, పునరావాసం అందలేదని బాధితులు వాపోయారు. నాడు శంకుస్థాపన చేసిన రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాటలు ఏ ఒక్కటీ అమలు కాలేదని వెల్లడించారు. పూర్తి పరిహారం చెల్లించిన తర్వాతనే పనులు ప్రారంభిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి.. పనులు మొదలై ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందించలేదని మండిపడ్డారు.
అప్పటి వరకు జరగనివ్వం
ఇప్పటికైనా భూ నిర్వాసితులకు పునరావాసం, నేటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇచ్చిన తర్వాతనే పనులు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి వరకు పనులు జరగనివ్వబోమని నిర్వాసితులు తేల్చిచెప్పారు. తమ సమస్యలను సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు తేల్చకుండా పోలీసు పహారాలో పనులు నిర్వహిస్తున్నారని నిర్వాసితులు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: Revanth Reddy: 'మీరే ఏకే 47 తూటాలు... సమష్టి పోరాటంతోనే అధికారం'