ETV Bharat / state

దైద వీరయ్యకు ఓయూ పీహెచ్​డీ పట్టా - Daida Veeraya Nalgonda

Daida Veeraya Get Phd Degree From Osmania University : నల్గొండ జిల్లా నందిపాడుకు చెందిన దైద వీరయ్య ప్రతిష్ఠాత్మకమైన ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్​డీ పట్టాను పొందారు. ఆర్ట్స్ కాలేజీలోని తెలుగు డిపార్ట్​మెంట్​కు చెందిన వీరయ్య 'డక్కలి కుల విజ్ఞానం- సమగ్ర అధ్యయనం' అనే అంశంపై పరిశోధన చేశారు. తెలుగు శాఖ ఆచార్యులు దాశరథుల నర్సయ్య పర్యవేక్షణలో ఈ పరిశోధన సాగింది. తెలుగుశాఖ అధ్యక్షులు ప్రొఫెసర్ కాశీం ఆధ్వర్యంలో తన ప‌రిశోధ‌నా ప‌త్రాన్ని ఉస్మానియా వ‌ర్సిటీకి స‌మ‌ర్పించారు.

Daida Veeraya Details
Daida Veeraya Get Phd Degree
author img

By ETV Bharat Telangana Team

Published : Jan 1, 2024, 10:17 PM IST

Updated : Jan 1, 2024, 10:26 PM IST

Daida Veeraya Get Phd Degree From Osmania University : నల్గొండ జిల్లాకు చెందిన వీరయ్య తెలుగులో ఉస్మానియా యూనివర్సిటీ నుంచి పీహెచ్​డీ పట్టా పొందారు. మిర్యాలగూడ మండలానికి చెందిన వీరయ్య తన స్వగ్రామమైన నందిపాడులో ప్రాథమిక విద్యాభాస్యాన్ని పూర్తి చేశారు. పదో తరగతిని మిర్యాలగూడలోని బకాల్ వాడీలో, సాకేత జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్​ను పూర్తి చేశారు. నాగార్జున కాలేజీలో డిగ్రీని పూర్తి చేశారు. ఎంఏ తెలుగును ఉస్మానియా వర్శిటీలోని ఆర్ట్స్ కాలేజీలో పూర్తి చేశారు. నెట్ (జాతీయ అర్హత పరీక్ష)లో క్వాలిఫై అయిన అనంతరం జేఆర్ఎఫ్(జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్)కు ఎంపికయ్యారు.

ఓయూ పీహెచ్‌డీ ప్రవేశాలకు కొత్త నిబంధనలు

Phd Candidate Daida Veeraya Details : కుప్పంలోని ద్రావిడ యూనివర్సిటీలో ప్రాజెక్ట్ అసిస్టెంట్​గా వీరయ్య పని చేశారు. ఓయూలోని తెలుగు శాఖలో పీహెచ్​డీ ప్రవేశం పొందారు. అక్కడే తన పరిశోధనను పూర్తి చేశారు. వీరయ్య(Daida Veeraya) రాసిన పదికి పైగా ఆర్టికల్స్ పలు జాతీయ, అంతర్జాతీయ పత్రికలలో ప్రచురితమయ్యాయి. 2019లో లాంగ్వేజ్ పండిట్ ప్రభుత్వ ఉద్యోగానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం యాదాద్రి జిల్లాలోని సూరారం ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయునిగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఉస్మానియా వర్సిటీ వేదికగా తెలంగాణ ఉద్యమంతో పాటు పలు సామాజిక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్రను పోషించారు.

Auto Driver's Wife Got PhD: 'సెల్యూట్ టు షీలా..' కష్టాలు అధిగమించి.. పీహెచ్​డీ సాధించిన గృహిణి

Osmania University Phd Candidates in Telugu : అత్యంత కింది స్థాయి నుంచి వెళ్లి వందేళ్ల చరిత్ర ఉన్న ఉస్మానియా వర్సిటీ నుంచి పీహెచ్​డీ పట్టాను సాధించటంపై వీరయ్య తల్లిదండ్రులు నర్సయ్య, చంద్రకళ ఆనందం వ్యక్తం చేశారు. పట్టాను పొందిన వీరయ్యకు యూనివర్శిటీ ప్రొఫెసర్లు, నందిపాడు గ్రామస్తులతో పాటు పలువురు అభినందనలు తెలిపారు. తనకు పీహెచ్​డీ(Phd) పట్టా రావటంపై దైద వీరయ్య ఆనందాన్ని వ్యక్తం చేశారు.

" వందేళ చరిత్ర గల ఓయూలో పీహెచ్​డీ పూర్తి చేయటం గర్వంగా ఉంది. కిందిస్థాయి నుంచి సాగిన నా ప్రయాణంలో సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ముఖ్యంగా జన్మినిచ్చిన తల్లిదండ్రులు, విద్యాబుద్ధులు నేర్పిన గురువులకు ఎప్పటికి రుణపడి ఉంటాను. సమాజాభివృద్ధిలో ఎల్లప్పుడూ నావంతు పాత్ర పోషిస్తా, విద్యార్థుల భవిష్యత్తుకై నిరంతరం కృషి చేస్తాను"- దైద వీరయ్య, పీహెచ్​డీ పొందిన వ్యక్తి

Special Story On Nalgonda Shaik Sayyed PhD : తినడానికి తిండి లేని స్థితి నుంచి డాక్టరేట్​గా.. సయ్యద్ ప్రయాణం ఆదర్శప్రాయం

Sake Bharati PhD story: పట్టుదలే ఆయుధం.. పీహెచ్​డీ పట్టా సాధించిన కూలీ

Last Updated : Jan 1, 2024, 10:26 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.