ETV Bharat / state

వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సీపీఎం - రైతుల ధర్నా

భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించి ఆదుకోవాలని నల్గొండ జిల్లా మిర్యాలగూడలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట నీటి పాలైనా ప్రభుత్వం, అధికారులు స్పందించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే అధికారులు స్పందించి నష్ట పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు. ఆర్డీవోకు వినతి పత్రం సమర్పించారు.

CPM Protest For Compensation For Crop loss Due to Floods In Miryalaguda
వర్షాల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి : సీపీఎం
author img

By

Published : Oct 19, 2020, 4:39 PM IST

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు నష్టపోయిన రైతలను ఆదుకోవాలని.. సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ధర్నా నిర్వహించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆర్డీవో కార్యాలయం ముందు సీపీఎం ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వాధికారులు వెంటనే స్పందించి నష్ట పరిహారం అందించాలని డిమాండ్​ చేశారు.

మిర్యాలగూడ డివిజన్ పరిధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు పాలేరువాగు, మూసీ నది, కృష్ణా నది పరివాహక ప్రాంతాలలో వరదల వల్ల వరి,పత్తి పంటలు నీటిలో మునిగి పోయాయని పంటచేలలో ఇసుక మేటలు వేసిందని.. అన్నారు. డివిజన్ పరిధిలో 12వేల ఎకరాల వరి, 6 వేల ఎకరాల్లో వేసిన పత్తి పంటలు పూర్తిగా పాడయ్యాయని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి తెలిపారు. కొన్నిచోట్ల వరదలకు కరెంటు స్తంభాలు, వైర్లు, ట్రాన్స్​ఫార్మర్లు, మోటార్లు వరదల్లో కొట్టుకుపోయాయని, అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టిన రైతులకు.. పంట చేతికి వచ్చే సమయంలో వర్షాలు తీరని నష్టం చేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు అధికారులు గానీ ప్రజాప్రతినిధులుగానీ.. క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి.. పంట నష్టాన్ని అంచనా వేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.25వేలు ఇవ్వాలని, ఇసుక మేటలు తీయడానికి రైతులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేయాలని డిమాండ్ చేశారు. రైతులుపంటపొలాలు పాడైపోయి.. బాధలో ఉంటే ధరణి అని, బతుకమ్మ చీరలు అంటూ అధికారులు, ప్రజా ప్రతినిధులు కాలం వెల్లదీస్తున్నారని.. రైతు గోడు పట్టించుకునే నాథుడే లేడని అన్నారు.

ఇదీ చూడండి: వర్షాలు తగ్గినా.. కష్టాలు తీరడం లేదు...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.