ETV Bharat / state

తెరాసని ప్రశ్నించడానికి నన్ను గెలిపించండి: జానారెడ్డి - తెలంగాణ వార్తలు

ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తెరాస మర్చిపోయిందని... ప్రశ్నించడానికి తనను గెలిపించాలని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి అన్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల నేపథ్యంలో వివిధ గ్రామాల్లో పర్యటిస్తున్నారు.

congress-senior-leader-jana-reddy-visited-bakkamanthupadu-village-in-nalgonda-district
తెరాసని ప్రశ్నించడానికి నన్ను గెలిపించండి: జానారెడ్డి
author img

By

Published : Mar 6, 2021, 3:14 PM IST

ఎందరో చేసిన త్యాగాల ఫలితంగా వచ్చిన రాష్ట్రంలో తెరాస అధికారంలోకి వచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి ఆరోపించారు. నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో తెరాస విఫలమైందని విమర్శించారు. భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ... తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని గుర్తు చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ఉపఎన్నికల్లో తనను గెలిపించాలని కోరారు. నల్గొండ జిల్లా నిడమనూరు మండలం బక్కమంతులపాడులో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నికల కోసమే మండలానికి ఒక ఇంఛార్జిని నియమించారని... ప్రజలకు మేలు చేయాడానికి కాకుండా మందు సీసాలు, డబ్బులు మోయడానికా? అని ప్రశ్నించారు. సాగర్ నియోజకవర్గ పరిధిలోని జరిగిన అభివృద్ధి తాను చేసిందే తప్ప ఎవరూ చేయలేదని అన్నారు. మాట ఇచ్చి నిలబెట్టుకోలేని సీఎం కేసీఆర్‌కు ఈ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని ఆయన అన్నారు. అనంతరం అదే మండలంలోని ముప్పారం, సోమువారి గూడెంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలకు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇదీ చదవండి: ధాన్యం మిల్లులో సెల్‌ఫోన్‌ రీఛార్జ్‌..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.