ETV Bharat / state

ఆ పనులు చేస్తే కేసీఆర్​ను సన్మానిస్తా: రాజగోపాల్ రెడ్డి

author img

By

Published : Mar 16, 2020, 7:38 PM IST

కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పవర్ ప్లాంట్​ల వల్లే 24 గంటల కరెంట్ వస్తోందని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణ జలాలతో నల్గొండలో ప్లోరైడ్​ను తరిమికొట్టింది హస్తం పార్టీయేనని పేర్కొన్నారు. గతంలో గట్టుప్పల్​ను మండలం చేస్తానని కేసీఆర్ హామీ ఇచ్చారని... ఈ రోజు అడిగితే సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నట్లు వివరించారు.

komatireddy
komatireddy

ప్రతిపక్షాల గొంతుకతో తాము ప్రజల పక్షాన్నే మాట్లాడుతామని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులతో వ్యక్తిగతంగా ఎలాంటి వైరంలేదన్నారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తనను జోకర్‌ అన్నారని... ఎవరు జోకరో మంత్రి విజ్ఞతకే వదిలేస్తున్నట్లు చెప్పారు.

కృష్ణ జలాలతో నల్గొండలో ప్లోరైడ్​ను తరిమికొట్టింది కాంగ్రెస్ పార్టీయేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన పవర్​ ప్రాజెక్టుల వల్లే రాష్ట్రంలో 24 గంటల విద్యుత్​కు కారణమని పేర్కొన్నారు. తెరాస మొదలుపెట్టిన ఒక్క పవర్​ ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని విమర్శించారు. సీఎం కేసీఆర్​ మంచి పనులు చేస్తే శాలువా కప్పి అభినందిస్తామని... ఇచ్చిన హామీలను నెరవేర్చకుంటే నిలదీస్తామన్నారు.

ఆ పనులు చేస్తే కేసీఆర్​ను శాలువాతో సన్మానిస్తా: రాజగోపాల్ రెడ్డి

ఇదీ చూడండి: 'రాష్ట్ర ఆర్థిక స్థితి బాగాలేకపోతే ఇవన్నీ ఎలా అమలు చేస్తాం?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.