Toyota Urban Cruiser Hyryder: టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ అరుదైన ఘనత సాధించింది. కేవలం రెండేళ్లలో లక్ష యూనిట్ల సేల్స్ నమోదు చేసి రికార్డు సృష్టించింది. మారుతి సుజుకితో భాగస్వామ్యం తర్వాత టయోటా అనేక మారుతీ రీబ్యాడ్జ్ మోడళ్లను మార్కెట్లో విడుదల చేసింది. అప్పటి నుంచి కంపెనీ సేల్స్ గణనీయంగా పెరిగాయి.
ఈ క్రమంలో టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్ కంపెనీ పోర్ట్‌ఫోలియోలో రెండో మారుతి రీబ్యాడ్జ్ కారుగా అవతరించింది. దీని హోల్‌సేల్ అమ్మకాలు భారతదేశంలో 1,00,000 యూనిట్లను దాటాయి. సెప్టెంబరు నెలలోనే టయోటా ఈ ఫీట్‌ను సాధించింది. ఈ కారు అక్టోబర్ చివరి నాటికి మొత్తం 1,07,975 యూనిట్ల సేల్స్ నమోదు చేసుకుంది.
కంపెనీ ఈ కారును సెప్టెంబర్ 2022లో విడుదల చేసింది. మారుతి బాలెనో నుంచి ఈ టయోటా గ్లాంజా హ్యాచ్‌బ్యాక్‌ను రూపొందించారు. ఇది కంపెనీ మొదటి రీబ్యాడ్జ్ కారు. ఈ కారు లక్ష యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది. అక్టోబర్ చివరి నాటికి ఈ హ్యాచ్‌బ్యాక్ 1,91,029 యూనిట్లను డీలర్‌షిప్‌లకు పంపినట్లు కంపెనీ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఏడు నెలల్లో (ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) టయోటా హైడర్ అమ్మకాలు సంవత్సరానికి (YoY) 52 శాతం పెరిగి 36,220 యూనిట్లకు చేరుకున్నాయి. ఇది టయోటా మొత్తం యుటిలిటీ వెహికల్ హోల్‌సేల్స్ 1,47,351 యూనిట్లలో దాదాపు నాలిగింట ఒక వంతు. దీనికి పండగ సీజన్ బాగా దోహదపడింది. అక్టోబరు ప్రారంభంలో కంపెనీ టయోటా హైరిడర్ ఫెస్టివల్ లిమిటెడ్ ఎడిషన్‌ను ప్రారంభించింది.
సమాచారం ప్రకారం.. 2024 ఆర్థిక సంవత్సరంలో (FY2024) టయోటా హైరైడర్ అమ్మకాలు 114 శాతం పెరిగి 48,916 యూనిట్లకు చేరుకున్నాయి. హ్యుందాయ్ క్రెటా, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హోండా ఎలివేట్, స్కోడా కుషాక్, వోక్స్‌వ్యాగన్ టైగన్, మహీంద్రా బొలెరో, బొలెరో నియో, థార్ వంటి అనేక ఇతర కార్లతో పోటీ పడుతూ టయోటా హైరైడర్ మెరుగైన పనితీరును కనబరిచింది. ఈ క్రమంలో FY2024లో ఆరో స్థానంలో నిలిచింది.
గూగుల్ మ్యాప్స్‌లో మనకి తెలియని ఎన్నో ఫీచర్లు!- వీటిని మీరు ఎప్పుడైనా ఉపయోగించారా?
బెంజ్ కారు ప్రియులకు షాక్!- ధరలు పెంచుతున్నట్లు ప్రకటించిన మెర్సిడెస్