ETV Bharat / state

నాగార్జునసాగర్​పై కాంగ్రెస్ నజర్ - nalgonda district news

నాగార్జునసాగర్‌ ఉప ఎన్నిక కాంగ్రెస్‌కు ప్రతిష్ఠాత్మకంగా మారింది. అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నేతలు దీనిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఈ ఉప ఎన్నిక కారణంగా పీసీసీ అధ్యక్ష పదవి నియామకం కూడా వాయిదా పడింది. దుబ్బాక శాసనసభ ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం జరుగుతున్నవి కావడం, నాలుగు దశాబ్దాలుగా అక్కడి నుంచే పోటీ చేస్తున్న పార్టీ సీనియర్‌ నేత జానారెడ్డి మరోమారు బరిలోకి దిగుతుండటంతో కాంగ్రెస్‌కు ఈ ఎన్నిక కీలకంగా మారింది. నేతల మధ్య ఐక్యతపై అధిష్ఠానం దృష్టిసారించింది.

congress action plan for nagarjuna sagar by election 2021
నాగార్జునసాగర్ ఉపఎన్నిక కోసం కాంగ్రెస్ వ్యూహం
author img

By

Published : Jan 12, 2021, 6:59 AM IST

నాగార్జునసాగర్ ఉప ఎన్నిక కాంగ్రెస్​ అధిష్ఠానం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. పీసీసీ అధ్యక్షుడి ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినా నేతల మధ్య ఏవైనా విభేదాలు తలెత్తితే ఈ ఉప ఎన్నిక వేళ ఇబ్బంది కలుగుతుందనే ఉద్దేశంతో దానిని కూడా వాయిదా వేసింది. పీసీసీ నియామకాన్ని తాత్కాలికంగా వాయిదావేయాలని పీసీసీ ముఖ్యనేతల్లో ఒకరిద్దరు మినహా దాదాపు అందరూ కోరడం గమనార్హం. దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల తర్వాత ఊపులో ఉన్న భాజపాను నిలువరించడంతో పాటు తెరాస సిట్టింగ్‌ స్థానమైన నాగార్జునసాగర్‌ను ఎలాగైనా దక్కించుకోవాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. దుబ్బాకలో ఆ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. జీహెచ్‌ఎంసీలో రెండు డివిజన్లు మాత్రం దక్కించుకుంది. ఈ రెండు ఎన్నికల్లోనూ భాజపా సత్తాచాటడం కాంగ్రెస్‌ను గందరగోళంలో పడేసింది. ఈ నేపథ్యంలో సాగర్‌ ఉప ఎన్నిక విజయంతో తెరాస, భాజపాకు సమాధానం చెప్పాలని భావిస్తోంది.

ముందే రంగంలోకి దిగిన జానా

నాగార్జునసాగర్‌ నుంచి సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి బరిలో దిగుతుండటం వల్ల ఈ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. పీసీసీ అధ్యక్షుడి నియామకాన్ని వాయిదా వేయాలని ఆయన కూడా కోరడంతో అధిష్ఠానం అంగీకరించి ఆ ప్రక్రియను తాత్కాలికంగా పక్కనపెట్టింది. జానారెడ్డికి ఈ నియోజకవర్గంతో నాలుగు దశాబ్దాల అనుబంధం ఉంది. ఆయన ఇప్పటికే పార్టీ శ్రేణులు, ముఖ్యనేతలతో చర్చిస్తున్నారు. ఇక్కడి నుంచి రెండుసార్లు జానాపై పోటీ చేసిన నోముల నర్సింహయ్య 2014 ఎన్నికల్లో ఓడిపోగా 2018 ఎన్నికల్లో 7,726 ఓట్ల మెజార్టీతో గెలిచారు. అనారోగ్యంతో నోముల డిసెంబరు 1న మృతి చెందారు. దీంతో సాగర్‌కు ఉప ఎన్నిక అనివార్యమైంది. జూన్‌ 1లోపు ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అంతకంటే ముందే ఇతర రాష్ట్రాల్లో కొన్ని ఉప ఎన్నికలు ఉండడంతో వాటితో కలిపి ఇక్కడా ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో కాంగ్రెస్‌ కార్యాచరణకు శ్రీకారం చుట్టింది. జానారెడ్డి సహా పూర్వపు నల్గొండ జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, మాజీమంత్రి ఆర్‌.దామోదర్‌రెడ్డి, రాష్ట్ర నేతలకు సాగర్‌ ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.