ETV Bharat / state

తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం - Nagarjunasagar byelection news

ఉపఎన్నిక ప్రచారం పతాకస్థాయికి చేరిన వేళ... నాగార్జునసాగర్‌లో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ప్రచారానికి వెళ్లిన అధికార పార్టీ అభ్యర్థిని... కాంగ్రెస్‌ శ్రేణులు అడ్డుకోవటంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలోనే నియోజకవర్గ వ్యాప్తంగా ఒకేరోజు మూడు చోట్ల ఘర్షణ పూరిత వాతావరణం నెలకొనటం వల్ల.. పోలీసులు లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. మరోవైపు ఘటనలకు మీరంటే మీరే కారణమంటూ... పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

nagarjuna sagar congress trs conflict, nagarjuna sagar congress by election news
తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం
author img

By

Published : Apr 14, 2021, 3:12 AM IST

Updated : Apr 14, 2021, 5:41 AM IST

తెరాస, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం

సాగర్‌ ఉపఎన్నికల పోలింగ్ గడువు దగ్గర పడుతున్నకొద్దీ... రెండు ప్రధాన పార్టీలు తెరాస, కాంగ్రెస్‌ మధ్య వివాదాలు భగ్గుమంటున్నాయి. హాలియా పురపాలికలోని 7, 8 వార్డులైన అనుముల పరిధిలో... తెరాస అభ్యర్థి భగత్, ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రచారం నిర్వహిస్తుండగా... ఊళ్లో అభివృద్ధిని విస్మరించి ప్రచారానికి ఎలా వస్తారంటూ.... కాంగ్రెస్ శ్రేణులు నిలదీశారు. ఇరువర్గాల మధ్య మాటల యుద్ధం పెరిగి... క్రమంగా గొడవ పెద్దదైంది. సముదాయించే ప్రయత్నం చేసినా విఫలమవటంతో... పలువురు పోలీసులు.... కాంగ్రెస్ కార్యకర్తలపై లాఠీఛార్జ్​ చేశారు. విషయం తెలుసుకున్న జానారెడ్డి చిన్న కుమారుడు జయవీర్ రెడ్డి... ఘటనా స్థలికి చేరుకుని ఖాకీలతో వాగ్వాదానికి దిగారు. దీంతో జానా అనుచరులు, పోలీసుల మధ్య తోపులాట చోటుచేసుకుంది. జిల్లా ఎస్పీ రంగనాథ్... ఇరువర్గాలకు సర్దిచెప్పి అక్కణ్నుంచి పంపించివేశారు.

తీవ్రస్థాయిలో మంత్రి ఆగ్రహం

మరోవైపు అనుముల మండలం కొత్తపల్లి వద్ద మంత్రి జగదీశ్ రెడ్డి మాట్లాడుతుండగా... ప్రైవేటు పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయుడు అశోక్... నిరుద్యోగ భృతి, ఇంటికో ఉద్యోగంపై ప్రశ్నించాడు. దీంతో మంత్రి ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. 'నీలాంటి వాళ్లను ఎంతోమందిని చూశానని... నిన్ను, మీ నాయకుణ్ని తొక్కిపడేస్తానంటూ సదరు యువకుణ్ని ఇతర పార్టీకి చెందిన వ్యక్తిగా భావించి... మంత్రి తీవ్రస్థాయిలో ఆగ్రహం చెందారు. దీంతో పోలీసులు ఆ యువకుణ్ని అక్కడి నుంచి పంపించివేశారు. వరుస ఘటనలపై స్పందించిన మంత్రి జగదీశ్‌రెడ్డి... జానారెడ్డి పథకం ప్రకారమే తనను అడ్డుకునే కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ఓటమి భయంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని...సీఎం సభలోనూ అల్లర్లు సృష్టించేందుకు కాంగ్రెస్‌ కుట్రలు చేస్తుందన్నారు.

చేయి చేసుకున్నారంటూ..

మరోవైపు నాగార్జునసాగర్ సిద్ధార్థ హోటల్లో ఉన్న కాంగ్రెస్ నేత మానవతారాయ్​పై పోలీసులు అకారణంగా చేయి చేసుకున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవితోపాటు కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. పోలీసుల అదుపులో ఉన్న మానవతారాయ్​ని వదిలిపెట్టాలని డిమాండ్ చేశారు. సీఎం సభను అడ్డుకుంటారన్న ఉద్దేశంతోనే... ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు.

వారిని విడుదల చేయాలి

అరెస్టు చేసిన కాంగ్రెస్‌ కార్యకర్తలతో విడుదల చేయకపోతే...సీఎం సభను అడ్డుకుంటామని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ ‌రెడ్డి హెచ్చరించారు. సాగర్‌లో ఘర్షణలపై నల్గొండ ఎస్పీ, జిల్లా కలెక్టర్, రిటర్నింగ్ ఆఫీసర్‌లతో ఉత్తమ్ మాట్లాడారు. ఓడిపోతామనే భయంతోనే తెరాస నేతలు ఇష్టానుసారంగా భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చూడండి: నేడు హాలియా బహిరంగ సభకు సీఎం కేసీఆర్​

Last Updated : Apr 14, 2021, 5:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.