సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్, భాజపా నాయకులు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని.. తాము తల్చుకుంటే వారు మిగలరని భాజపాను ఉద్దేశించి హెచ్చరించారు. ఇతర సభల వద్ద వీరంగం సృష్టించడం మంచిదికాదని హాలియా సభలో హితవు పలికారు.
వారికి రాబోయే రోజుల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు. డిండి, ఎస్‌ఎల్‌బీసీ త్వరలో పూర్తికాబోతున్నాయన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇచ్చి హామీ నిలబెట్టుకున్నామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ పేరు ఉచ్చరించే అర్హత కూడా లేదన్నారు.
ఇదీ చదవండి: కృష్ణా-గోదావరి నదులను అనుసంధానిస్తాం: కేసీఆర్