నాగార్జునసాగర్ డ్యామ్ వాస్తవానికి ఏలేశ్వరం దగ్గర కట్టాలని.. అక్కడే డ్యామ్ కడితే లిఫ్టుల అవసరమే వచ్చేది కాదని సీఎం కేసీఆర్ అన్నారు. 19 కి.మీ. దిగువన ప్రాజెక్టును కట్టి తెలంగాణకు అన్యాయం చేశారని ఆరోపించారు. దాదాపు 3 వేల గ్రామాలను నేడు ఎస్టీలు పాలిస్తున్నారని గుర్తు చేశారు. గొర్రెలను మేసిన వీళ్లు.. యాదవులకు ఏనాడైనా గొర్రెలిచ్చారా అంటూ ప్రశ్నించారు. నాగార్జునసాగర్, హుజూర్‌నగర్, మిర్యాలగూడ పరిధిలోని ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేస్తామన్నారు.
ఎత్తిపోతల పథకాలన్నీ పూర్తి చేయకపోతే వచ్చే ఎన్నికల్లో ఓట్లు అడగనని స్పష్టం చేశారు. సాగర్ ఆయకట్టుకు గోదావరి జలాలు తీసుకొస్తానని తెలిపారు. ప్రజాదర్బార్ పెట్టి పోడు భూముల సమస్య పరిష్కరిస్తామని పేర్కొన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారం సాగర్ నుంచే శ్రీకారం చుడతామన్నారు. అధికార యంత్రాంగాన్ని తీసుకొచ్చి.. రెండు రోజులు ఇక్కడే ఉండి సమస్య పరిష్కరిస్తానని తెలిపారు.
ఇదీ చదవండి: 30 ఏళ్ల అనుభవం ఉన్నా అభివృద్ధి సున్నా: కేసీఆర్