ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి ఒక్కరూ జనతా కర్ఫ్యూ పాటించాలని సీఎల్పీ మాజీ నేత కుందూరు జానారెడ్డి అన్నారు. కరోనా వ్యాప్తి నివారణలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని అందరూ గౌరవించాలని సూచించారు.
సభలు, సమావేశాలు, వేడుకలు బహిరంగగా నిర్వహించొద్దని సూచించారు. అందులో భాగంగానే తన రాజకీయ గురువు పీవీ సత్యనారాయణ సంస్మరణ సభ జరపడం లేదని తెలిపారు. దగ్గరి బంధువులతోనే కర్మకాండను నిర్వహిస్తున్నట్టు వెల్లడించారు. రెండు రాష్ట్రాల్లోని అభిమానులు, శ్రేయోభిలాషులు, మిత్రులు దీనిని గమనించి సహకరించాలని కోరారు.
ఇదీ చూడండి: ఉపాధ్యాయునిపై ప్రధానోపాధ్యాయుడి దాడి