రామాలయ నిర్మాణం విషయంలో భాజపా, తెరాస కార్యకర్తలు ఘర్షణకు దిగిన ఘటన నల్గొండ జిల్లా మడుగులపల్లి మండలం గారకుంట గ్రామంలో జరిగింది. జిల్లా భాజపా అధ్యక్షుడు కంకణాల శ్రీధర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు త్రిపురారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
రామాలయ నిర్మాణం కోసం భూమి పూజ చేయడానికి వచ్చిన తనను పోలీసులు అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని నల్గొండ జిల్లా భాజపా అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని మడుగులపల్లి మండలంలో తెరాస నేతలు 20 ఎకరాల భూముల్ని కబ్జా చేస్తే పట్టించుకోని పోలీసులు ఆలయ నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని అన్నారు.
పోలీసులు తెరాస కార్యకర్తలను ఒకలాగా భాజపా కార్యకర్తలను మరోలాగా చూస్తున్నారని శీధర్ రెడ్డి ఆరోపించారు. తనను అరెస్ట్ చేయడాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్లోనే ఆందోళనకు దిగారు. ఈ గొడవంతటికీ కారణమైన ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిని వెంటనే ఆర్మూరుకు పంపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఇతర రాష్ట్రాలకు 'వీ హబ్' ఆదర్శంగా నిలుస్తోంది: మంత్రి కేటీఆర్