ETV Bharat / state

'మలి విడతలో ఇళ్ల వద్దనే చెక్కుల పంపిణీ' - మిర్యాలగూడ ఎమ్మెల్యే తాజా వార్తలు

నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 119 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ చెక్కులను ఎమ్మెల్యే భాస్కరరావు అందజేశారు. కరోనా సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా తన వంతు కృషి చేస్తానని ఆయన అన్నారు.

cheques distribution in miryalaguda town by mla bhaskarrao
'మలి విడతలో లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వచ్చి చెక్కుల పంపిణీ'
author img

By

Published : Dec 24, 2020, 12:52 PM IST

లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా మలివిడతలో కల్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్​ చెక్కులను ఇంటి వద్దకే వచ్చి చెక్కులు అందజేస్తామని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు అన్నారు. ఈ మేరకు పట్టణంలో 119 మంది లబ్ధిదారులకు చెక్కులను అందజేశారు. సీఎం సహాయ నిధి చెక్కులను ప్రస్తుతం ఇళ్ల వద్దకే వచ్చి అందజేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు.

కరోనా లాక్​డౌన్​తో రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పథకాలు అమలు చేస్తున్నామని భాస్కరరావు పేర్కొన్నారు. ప్రజా ప్రయోజన పథకాలు అందరికీ అందేలా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్​, మున్సిపల్​ ఛైర్​పర్సన్​, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి: గుడ్‌గావ్‌ కేంద్రంగా... దా'రుణా'లెన్నెన్నో..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.