నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 40 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే భాస్కరరావు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేశారు. పట్టణానికి చెందిన పేదలకు ఆరోగ్య ఖర్చులకై సీఎం రిలీఫ్ ఫండ్ కింద 40 మందికి రూ.12 లక్షల 46,500 విలువ చేసే చెక్కులు మంజూరయ్యాయి. వాటిని లబ్ధిదారులకు ఎమ్మెల్యే అందజేశారు.
నియోజకవర్గానికి చెందిన పేద ప్రజలు.. వైద్యానికి సంబంధించిన బిల్లులను క్యాంపు కార్యాలయంలో అందజేసినట్లయితే వారికి సీఎం సహాయనిధి ద్వారా చెక్కులు అందేలా చూస్తామని భాస్కరరావు తెలిపారు. గతంలో ఆరోగ్య శ్రీ ఉన్నవారికి అత్యవసర పరిస్థితుల్లో ఎన్ఓసీ ద్వారా ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించేవారు కానీ.. ఇప్పుడు ప్రభుత్వం నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మాత్రమే ఎన్ఓసీ ద్వారా వైద్య సేవలకై నిర్ణయం తీసుకుందని వెల్లడించారు. నియోజకవర్గ ప్రజలు ఈ ఆస్పత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో చేరితే ఎన్ఓసీ ద్వారా డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తానని వివరించారు.
ఇదీ చదవండి: రాష్ట్ర రిజిస్ట్రేషన్ల వ్యవస్థ దేశానికే ఆదర్శంగా నిలుస్తుంది: సీఎస్