నాగార్జునసాగర్‌లోని బుద్ధవనంలో బుద్ధుని 2563వ జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో తెలంగాణ పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఛైర్మన్ భూపతి రెడ్డి, ఎండీ మనోహర్ పాల్గొన్నారు. శ్రీలంక పార్లమెంట్ సభ్యుడు అత్రిలియో రతన్ తేరు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పలు దేశాల నుంచి బౌద్ధ మతస్తులు బుద్ధవనం చేరుకుని వారి ఆచారాల ప్రకారం ప్రార్థనలు చేశారు. బుద్ధ కళ ప్రాచుర్యాన్ని బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లేపల్లి లక్ష్మయ్య మంత్రికి వివరించారు. నాగార్జున సాగర్ ప్రశాంతంగా ఉంటుందని, బౌద్ధ ధర్మాలు పాటించాలంటే శాంతి ముఖ్యమని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాబోయే రోజుల్లో నాగార్జునసాగర్‌లో అంతర్జాతీయ బౌద్ధ విశ్వవిద్యాలయం నిర్మించడానికి ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
ఇవీ చూడండి: పవిత్ర గుహలో 'మోదీ బాబా' యోగ ముద్ర