నల్గొండ జిల్లా చారిత్రక దేవరకొండ ఖిల్లాను బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్ కుటుంబంతో కలిసి సందర్శించారు. లింగ్యా నాయక్ ఐబీ వద్ద అధికారులు వీరికి స్వాగతం పలికారు. ఖిల్లాలో హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కను నాటారు. అనంతరం మహిళలతో కలిసి ఆండ్రూ ఫ్లెమింగ్ భార్య వ్యాన్ ఫ్లెమింగ్ బతుకమ్మ ఆడారు. ఖిల్లా దుర్గం పైకి ఎక్కి చరిత్రను తెలుసుకున్నారు.
ఇదీ చూడండి :"అప్పుడే పుట్టిన పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ అవసరం"