ETV Bharat / state

KTR VS BJP: మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు భాజపా యత్నం - bjp leaders obstruct the ktr convoy in chityal

KTR VS BJP: నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్​కు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఆయన కాన్వాయ్​ ముందుకు వెళ్లి.. ఆందోళనకు దిగారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి వారిని పక్కకు తప్పించారు.

bjp leaders obstruct the ktr convoy
మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​ను అడ్డుకున్న భాజపా శ్రేణులు
author img

By

Published : Dec 31, 2021, 4:01 PM IST

KTR VS BJP: నల్గొండ జిల్లా పర్యటనకు వెళ్తున్న మంత్రి కేటీఆర్‌ను భాజపా శ్రేణులు అడ్డుకునేందుకు ప్రయత్నించాయి. చిట్యాలలో కేటీఆర్‌ కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు ఆ పార్టీ కార్యకర్తలు యత్నించారు. ఇంటికో ఉద్యోగం హామీ ఏమైందంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ క్రమంలో ఆందోళన చేస్తున్న కమలం పార్టీ శ్రేణులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అందుకోసమే నల్గొండ పర్యటన

రెండు రోజుల క్రితం నల్గొండ జిల్లాలో పర్యటించిన సీఎం కేసీఆర్​.... సిద్దిపేట, గజ్వేల్‌ తరహాలో నల్గొండను అభివృద్ధి చేయాలని నిర్దేశించారు. అందుకు అనుగుణంగా పట్టణంలో మౌలిక సౌకర్యాల కల్పన, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మంత్రులు కేటీఆర్​, జగదీశ్​ రెడ్డి, ప్రశాంత్​ రెడ్డి నేడు నల్గొండకు బయలుదేరారు.

తొలుత ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఐటీ హబ్​తో పాటు ఎస్సీ, ఎస్టీ వసతి గృహాల నిర్మాణాలు, సమీకృత మార్కెట్ సముదాయానికి శంకుస్థాపన చేయనున్నారు. పట్టణంలో మౌలిక సౌకర్యాల కల్పన, సుందరీకరణ పనులు చేపట్టేందుకు ప్రత్యేక కార్యాచరణకు శ్రీకారం చుట్టారు.

మంత్రి కేటీఆర్​ కాన్వాయ్​ను అడ్డుకుంటున్న భాజపా శ్రేణులు

ఇదీ చదవండి: KTR Nalgonda Tour : నేడు నల్గొండకు మంత్రి కేటీఆర్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.