ETV Bharat / state

సాగర్​ ఉపఎన్నికలో భాజపా గెలుపు ఖాయం: సంకినేని - నాగార్జునసాగర్​ ఉపఎన్నికలు

నాగార్జునసాగర్​ ఉపఎన్నికల్లో కాషాయ జెండా ఎగురనుందని భాజపా సమన్వయకర్తలు ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధిష్ఠానం ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా... అందరూ కలిసి పనిచేసి కాషాయ జెండా ఎగరేయాలని కార్యకర్తలను కోరారు.

'సాగర్​ ఉపఎన్నికలో భాజపా జెండా ఎగరటం ఖాయం'
bjp coordinators meeting on nagarjuna sagar by elections
author img

By

Published : Jan 2, 2021, 7:00 PM IST

నాగార్జునసాగర్ ఉపఎన్నికల్లో భాజపా జెండా ఎగురుతుందని సాగర్ ఉపఎన్నికల భాజపా సమన్వయకర్తలు సంకినేని వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీ చాడ సురేశ్​​రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఉపఎన్నికల్లో తెరాస, కాంగ్రెస్ పార్టీలను ప్రజలు నమ్మరని తేల్చిచెప్పారు. సాగర్​లో ఎలాంటి అభివృద్ధి చేయని తెరాస, కాంగ్రెస్ పార్టీలు ఓట్లెలా అడుగుతాయని ప్రశ్నించారు.

కేంద్ర ప్రభుత్వం నిధులను దారి మళ్లించి మోదీ ప్రభుత్వం ఏమి ఇవ్వడం లేదని తెరాస ప్రచారం చేస్తోందని ఆరోపించారు. పార్టీ అధిష్ఠానం ఎవ్వరికి టిక్కెట్ ఇచ్చినా... అందరూ కలిసి పనిచేసి కాషాయ జెండా ఎగరేయాలని కార్యకర్తలను కోరారు.

ఇదీ చూడండి: రాష్ట్రంలో 7 కేంద్రాల్లో డ్రైరన్.. వ్యాక్సినేషన్ ప్రక్రియ విజయవంతం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.