ETV Bharat / state

Road Accident At Nalgonda : హైవేపై ఇసుక కారును బోల్తా పడేసింది.. ఒకరి ప్రాణం తీసింది..

Road Accident At Nalgonda : నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆర్టీసీ బస్సును ఢీకొనడంతో డ్రైవర్​కు స్వల్పంగా గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.

Road Accident
Road Accident
author img

By

Published : May 15, 2023, 5:05 PM IST

Road Accident At Vijayawada National Highway : ఈ మధ్యకాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మనం వాహనాన్ని మంచిగా నడిపినా ఎదుటి వారు సరిగ్గా నడుపుతారో లేదో తెలీదు. అత్యంత వేగం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. అతివేగం వల్ల డివైడర్​ను ఢీ కొట్టడం, స్కిడ్​ అవ్వడం క్షణంలో జీవితమంతా తిరగపడిపోతుంది. చాలా వరకు రోడ్డు ప్రమాదాల్లో హెల్మెట్​ పెట్టుకోకపోవడం, సీటు బెల్ట్​ ధరించక పోవడం వల్ల ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. ఒక్క రోడ్డు ప్రమాదం ఒక వ్యక్తిని కుటుంబానికి ఎల్లకాలం దూరం చేస్తుంది. అదే పేద కుటుంబం అయితే ఆ ప్రమాదమే వారిని రోడ్డున పడేస్తుంది.

నల్గొండ జిల్లా చిట్యాల శివారులో జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్​ వైపు వెళుతున్న కారు రోడ్డుపై ఇసుక ఎక్కువగా ఉండడం వల్ల స్కిడ్​ అయ్యింది. దీంతో కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొని ఎదురుగా హైదరాబాద్​ నుంచి నల్గొండకు వెళుతున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు లిఫ్టు తీసుకొని ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

కారు వేగంగా బస్సును ఢీకొనడంతో డ్రైవర్​తో పాటు ఐదుగురికి స్వల్పంగా గాయలయ్యాయి. వారందరిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. బస్సు కారు రోడ్డుకు అడ్డంగా పడడంతో కొద్దిసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్​ జామ్​ ఏర్పడింది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదానికి గురైన వాహనాలను రోడ్డుపై నుంచి తొంగించి ట్రాఫిక్​ క్లియర్​ చేశారు. ప్రమాద సమయంలో బస్​లో ఇరవై మంది ప్రయాణికులు ఉన్నారు. ప్రయాణీకులకు ఎలాంటి గాయాలు కాలేదని వారు సురక్షితంగా ఉన్నారని పోలీసులు తెలిపారు.

చర్యలు చేపట్టిన ఆగని ప్రమాదాలు: రోడ్డు ప్రమాదాలను అరికట్టాడానికి రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతున్న ప్రమాదాలు మాత్రం తగ్గడం లేదు. రోడ్డుపై ప్రజలకు అందుబాటులో ఉండడానికి ఎమర్జెన్సీ ఫోన్​లను కూడా పెట్టారు. రోజు డ్రంక్​ అండ్​ డ్రైవ్​, హెల్మెట్​ ధరించని వారికి, సీటు బెల్ట్​ పెట్టుకోనివారికి చలాన్లు వేస్తున్న ప్రజల్లో మార్పు రావడం లేదు. ఈ తప్పులను మళ్లీ మళ్లీ చేస్తున్న వారికి పోలీసులు కౌన్సిలింగ్​లు ఇస్తున్నప్పటికి ప్రమాదాలు తగ్గడం లేదు.

ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు... ఒకరు మృతి

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.